![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద కనిపించే విశ్వా కల నెరవేరింది . ఎట్టకేలకు ఫిట్నెస్ సెంటర్ ని ఓపెన్ చేసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫిట్నెస్ సెంటర్ ఓపెనింగ్ కి చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. ఓపెనింగ్ చాల గ్రాండ్ గా జరిగింది. విశ్వా హాఫ్ నేకేడ్ ఫోటో పెట్టి "మెంబర్స్ షిప్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రీమియం ట్రైనింగ్ రియల్ రిజల్ట్స్ " అంటూ దాని కింద ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారో కూడా మెన్షన్ చేసాడు. "మహిళల కోసం ఫెమ్ ఫిట్ , పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ , యోగా సెషన్స్, పర్సనల్ ట్రైనింగ్ క్లాసులు" వంటివి కూడా ఇస్తున్నట్టు చెప్పాడు. ఇక ఈ ఫిట్నెస్ సెంటర్ ఓపెనింగ్ కి శివబాలాజీ, మధుమిత, స్రస్టి వర్మ వచ్చారు.
రాము రాథోడ్ వచ్చి ఒక చిన్న షాల్ తెచ్చి సత్కారం లాంటిది చేసాడు. ఇంద్రనీల్ , సునందమాల , బెబక్క, ఆరియానా, బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా, అంజలి - పవన్ - చందమామ, బిగ్ బాస్ మణికంఠ , అర్జున్ కళ్యాణ్, శ్రీప్రియ, అన్షు రెడ్డి వంటి వాళ్లంతా వచ్చారు. ఇక మధ్యలో వచ్చిన వాళ్ళతో రాపిడ్ ఫైర్ ఆడించారు. డాన్స్ లు వేశారు. వచ్చిన అందరికి స్పెషల్ గా తయారు చేసిన ఒక ప్రోటీన్ షేక్ బోటిల్ ఇచ్చాడు విశ్వా. అందరూ విశ్వా అండ్ ఫ్యామిలీకి బెస్ట్ విషెస్ చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 5 లో విశ్వ కంటెస్టెంట్ గా వెళ్ళాడు.
![]() |
![]() |